ఏ స్టూడెంట్కైనా అటెండెన్స్ తక్కువగా ఉంటే మందలించడమో, లేదా వారి తల్లిదండ్రలను పిలిపించి మాట్లాడడమో కాలేజ్ యాజమాన్యాలు చేసే పని. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా కాలేజీ యాజమాన్యంతో పాటు, ప్రిన్సిపాల్ సహ ఆ స్టూడెంట్ కాళ్లు మొక్కేలా చేశారు ఏబీవీపీ సంఘం నాయకులు. ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని హాజరు తక్కువగా ఉండడంతో ఏబీవీపీ నేత అక్షత్ జైస్వాల్, ఆ విద్యార్థినితోపాటు మరి కొందరిని వెంటపెట్టుకుని మహిళా ప్రిన్సిపాల్ మోనికా స్వామి చాంబర్‌కు వెళ్లాడు. హాజరు తక్కువగా వేశారంటూ ప్రిన్సిపాల్, ఆ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
ગુરૂ ની ગરિમા ને તાર- તાર કરનાર @ABVPGujarat નાં નેતાઓ સામે @jitu_vaghani શિક્ષણ વિભાગ ખુદ ફરિયાદી બને – @NSUIGujarat @Neerajkundan@jagdishthakormp @Pawankhera @rssurjewala @drmanishdoshi@IG_Gohil_ @SatveerINC @Mahipalsinh_INC#SameOnABVP#एबीवीपी_के_गुंडे pic.twitter.com/IBXsYc87H8
— Bhavik Solanki (@bhaviksolankee) May 13, 2022
ఆ విద్యార్థిని కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక ఆ గొడవను ఎలా ఆపాలో తెలియక చివరకు మహిళా ప్రిన్సిపాల్ మోనికా, ఆ విద్యార్థినికి రెండు చేతులతో మొక్కింది. అనంతరం తన కూర్చి నుంచి లేచి ఆమె కాళ్లు మొక్కింది. దీనిపై పలు విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.
ఏబీవీపీ చేసిన చర్యను కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా విమర్శించింది. ఏబీవీపీ కార్యకర్తల చర్య సిగ్గుచేటని ఎన్ఎస్యుఐ జాతీయ కన్వీనర్ భావిక్ సోలంకి పేర్కొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు గూండాయిజానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. మరోవైపు జైస్వాల్ చర్యకు క్షమాపణలు చెబుతూ ఏబీవీపీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.