చిలుకూరులో జాటాయు ఆర్మీ.. పోకిరోళ్లకు చుక్కలే..   - MicTv.in - Telugu News
mictv telugu

చిలుకూరులో జాటాయు ఆర్మీ.. పోకిరోళ్లకు చుక్కలే..  

August 13, 2019

Woman protection Jatayu army.

అమ్మాయిలు కనిపిస్తే చాలు కొంతమంది కుర్రాళ్లే, కాకుండా ముతముసలాళ్లు కూడా అప్పటికప్పుడు పెద్ద రోగం వస్తుంది. కావాలని ముట్టుకోవడం నుంచి అత్యాచారాల వరకు తెగబడుతుంటారు. ఇల్లు, రోడ్డు, రైలు, బస్సు.. గుడి, పొలం.. ఎక్కడైనా సరే ఈ దుర్మార్గులు జనంలో కలిసి తిరుగుతుంటారు. అలాంటి వారి పని పట్టేందుకు చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు భక్తులతో కలసి ఒక ఆర్మీని తయారు చేశారు. పేరు ‘జాటాయు సేన’. దీన్ని ఈ రోజు(మంగళవారం)  ప్రారంభించారు. రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లేప్పుడు జటాయు పక్షి అడ్డుకుందని, అందుకోసమే తాము ఆ పక్షి పేరును ఈ ఆర్మీకి పెట్టామని వివరించారు. గత ఏడాది రాఖీ ఛాలెంజ్‌కు నిర్వహించామని, దానికి కొనసాగింపు ఈ సేనను ఏర్పాటు చేశామని చెప్పారు.

మహిళలు, బాలికలపై వేధింపులను ఇది అడ్డుకుంటందని ఆలయ ప్రధానార్చకులు  రంగరాజన్ తెలిపారు. ‘మహిళలపై వేధింపులను అడ్డుకునే వారందరూ ఇందులో చేరొచ్చు. దీనికోసం కర్రసాము, కత్తిసాము నేర్చుకోవాల్సిన పనిలేదు. ఈ సేన ప్రతి జిల్లాలో,  ప్రతి మండలంలో, ప్రతి పల్లెలో ఉండాలి. నేరాలు జరిగాక స్పందించడం కాకుండా వాటిని జరగకుండా అడ్డుకోవాలి. జటాయు సేనలో చేరడానికి చిలుకూరుకే రానక్కర్లేదు. ఎక్కడున్న వాళ్లు అక్కడే ఆడవారికి అండగా నిలబడాలి’ అని అన్నారు.