తినడం కోసమే ఉద్యోగం వదిలేసింది! - MicTv.in - Telugu News
mictv telugu

తినడం కోసమే ఉద్యోగం వదిలేసింది!

November 12, 2019

ఇంటర్నెట్‌లో ఫ్రీగా వీడియోలు చూడాలంటే వెంటనే యూట్యూబ్ గుర్తుకు వస్తుంది. అలాగే యూట్యూబ్‌లో వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వస్తే పాపులారిటీతో పాటు డబ్బులు కూడా వస్తాయి. దీంతో కొందరు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం మాత్రమే పనిగా పెట్టుకొని సంపాదిస్తున్నారు. ఆ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న ఫవర్ అది. తాజాగా లండన్‌కు చెందిన చర్నా రైలీ అనే 22 ఏళ్ళ మహిళ తన జాబ్‌కు గుడ్‌బై చెప్పి యూట్యూబ్ వీడియోలు చేయడం పనిగా పెట్టుకుంది. యూట్యూబ్ వీడియోలకు వచ్చే సంపాదనపైనే ఆధారపడుతోంది.

అయితే యూటుబ్ వీడియోల కోసం ఆమె చేసే కంటెంట్ గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా షాకవ్వాల్సిందే. రోజంతా ఫాస్ట్ ఫుడ్ తింటూ.. ఆ సీన్ మొత్తాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడమే ఆమె పని. ఇలా ఆమె తింటూ ఉంటే మనం చూడమేంటి అనుకుంటున్నారా? ఇప్పటికే ఆమె వీడియోలను ప్రతిరోజు 40వేల మంది చూస్తున్నారు. వీక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసిన ఆశ్చర్యపోయిన చర్నా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రోజంతా..పిజ్టాలు, బర్గర్‌లు తింటూ..వీడియోలను యూట్యూబ్‌లో పెడుతూ తెగ సంపాదిస్తోంది.