కులం వేరని పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు.. కత్తితో ఇరువురి దాడి - MicTv.in - Telugu News
mictv telugu

కులం వేరని పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు.. కత్తితో ఇరువురి దాడి

May 16, 2022

ఫేస్‌బుక్‌లో ఇద్దరికి పరిచయం ఏర్పడి సరిగ్గా ఏడాదిన్నర. ఈ సమయంలోనే ఒకరినొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అప్పుడే యువకుడి కులం వేరని తెలియడంతో ఆ యువతి అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యన తలెత్తిన గొడవలో ఒకరినొకరు కత్తితో దాడి చేసుకొని ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో చోటుచేసుకుంది.
ఝార్ఖండ్ రాంచీ జిల్లాలోని ఇత్కీ బజార్‌కు చెందిన శుభమ్ బైతా, బొకారో జిల్లాలోని బలిదహ్‌కు చెందిన అమ్మాయిల రొమాంటిక్ క్రైమ్ స్టోరీ ఇది. లోహర్దగాలోని తన సోదరి ఇంటికి వచ్చిన యువతిని.. పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి కోరాడు ఆ యువకుడు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఆప్లికేషన్ తీసుకువచ్చి సంతకం చేయమని కోరాడు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని యువతి తేల్చిచెప్పడంతో.. కోపోద్రిక్తుడైన యువకుడు ఆమె గొంతు కోశాడు. అనంతరం అతడు కూడా గొంతు కోసుకున్నాడు. కాగా యువతే కత్తితో తన గొంతు కోసి.. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించిందని యువకుడు చెబుతున్నాడు.