Woman rents out her husband to other women as he's handy around the house
mictv telugu

భర్తను అద్దెకిస్తున్న భార్య.. అద్దె రూ. 3500

June 30, 2022

Woman rents out her husband to other women as he's handy around the house

ఓ మహిళ తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇస్తోంది. తన భర్త పనిమంతుడు అని చెప్పి.. రోజుకు అతని ద్వారా రూ.3,500 సంపాదిస్తోంది. ఇదేదో కొంచెం తేడాగా ఉన్నట్లుందే అని అనిపిస్తోంది కదూ. కాస్త, అలాంటి ఆలోచనలను పక్కన పెట్టి అసలు విషయం తెలుసుకుందాం.. యూకే కి చెందిన లారా యంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బకింగ్‌హామ్‌షైర్‌లో నివసిస్తోంది. జేమ్స్‌ చాలామంచివాడు, ఇంట్లో ఎలాంటి పనులైనా అవలీలగా చేసేస్తాడు. లారా తన ప్లాన్ ప్రకారం భర్త జేమ్స్‌కి రకరకాల ఇంటి పనులు నేర్పించింది. మహిళలు చేసుకునే ఎన్నో రకాల పనులను అతను నేర్చుకున్నాడు. అలాగే.. రకరకాల వర్కర్లు చేసే పనులన్నీ నేర్చుకున్నాడు. అలాగే ఇంటిని అలంకరించడం నుంచి కార్పేట్ పనుల వరకు ఏదైనా సరే చేసేస్తాడు. జేమ్స్‌కు తోటపని అంటే కూడా ఇష్టమే.

అంత ప్రతిభ ఉన్న తన భర్తను ఖాళీగా ఉంచడం ఎందుకని అనిపించి… ‘Rent my handy husband’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే ఫేస్‌బుక్ ఇతరాత్ర సోషల్ మీడియా యాప్స్, స్నేహితుల సహాయంతో గట్టి ప్రచారమే చేసింది. అద్దెకు తీసుకోండి.. అన్ని పనులూ చేయించుకోండి అని ఆఫర్ ఇచ్చింది. మొదట కొంచెం నెగెటివ్ టాక్ వచ్చినా… బయటి వ్యక్తులకు పనులు ఇచ్చే కంటే… తెలిసిన వ్యక్తి అయిన లారా భర్తకు పనులు ఇవ్వడం మంచిదని భావించిన ఫ్రెండ్స్, స్థానికులు అతనికి పనులు ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతమంది మహిళలకు లారా ఐడియా బాగా నచ్చింది. ‘‘మీ భర్తను అద్దెకు తీసుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటూ ఆమెను ప్రోత్సహించారు. అలా వారి ఇళ్లకు వెళ్లి… పనులు చేసి… డబ్బు తీసుకుంటున్నాడు జేమ్స్.

. వాస్తవానికి జేమ్స్ ఒక మాజీ వేర్‌హౌస్ వర్కర్. కొన్నేళ్ల కిందట అతడు లారాకు, వారి ముగ్గురు పిల్లలతో తోడుగా ఉండటం కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. జేమ్స్ పిల్లల్లో ఇద్దరు ఆటిస్టిక్‌తో బాధపడుతున్నారు. వారికి సాయంగా ఉంటూనే చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. జేమ్స్‌ను అద్దెకు తీసుకొనే మహిళ.. అతడిని ఇంటికి తీసుకెళ్లి పనులు చేయించుకోడానికి 35 పౌండ్లు (రూ.3352) చెల్లించాలి. ఆ మొత్తంతో వారు ఎంత పెద్ద పనులైనా చేయించుకోవచ్చు. వికలాంగులకు, విద్యార్థులకు, 65 ఏళ్లు పైబడిన పెద్దవాళ్లకు మాత్రం తక్కువ ధరలోనే జేమ్స్ తన సేవలు అందిస్తాడు. ఈ ఉద్యోగం ఏదో బాగుంది కదూ.