పురిట్లో చనిపోయిన కూతురు.. మగవాడిలా తిరిగొచ్చింది!! - MicTv.in - Telugu News
mictv telugu

పురిట్లో చనిపోయిన కూతురు.. మగవాడిలా తిరిగొచ్చింది!!

October 18, 2019

Woman Reunites With Child After 29 Years

30 ఏళ్ల క్రితం చనిపోయిందని అనుకున్న బిడ్డ నుంచి ఊహించని విధంగా  మెయిల్ వచ్చింది. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న టినా బెజరనోకు నేను మీ కొడుకును.. ఓసారి మిమ్మల్ని కలవాలి అంటూ క్రిస్టిన్ అనే వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. దీన్ని చదివిన బెజరనో అతనికి రిప్లే ఇచ్చింది. తాను ఆడబిడ్డకు జన్మను ఇచ్చానని మీరు ఎవరికో పంపాల్సిన మెయిల్ మరొకరికి పంపారంటూ రిప్లే ఇచ్చింది. దీనికి అటు వచ్చిన సమాధానం విన్న ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. 

‘మీరు చెబుతున్నది నిజమే. నేను ఆడపిల్లనే కానీ ఇటీవల లింగమార్పిడి చేయించుకున్నాను. ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంటున్నాను. నా పెంపుడు తల్లి మీరే నా కన్న తల్లి అని చెప్పింది. మీరు నమ్మాలంటే డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమే. ఓసారి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పాడు. ఇది విన్నబెజరనో ఎంతో సంబరపడిపోయింది. లింగమార్పిడి చేసుకున్నా సరే తన బిడ్డ బతికి ఉందని తెలియడం సంతోషంగా ఉందంటూ చెబుతోంది. 

కాగా టినా బెజరనో.. 17 ఏళ్ల వయస్సులో పెళ్లికాకుండానే  ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన 15 నిమిషాల్లోనే చనిపోయిందని బెజరనో తల్లి ఆమెకు చెప్పింది.  అప్పటి నుంచి బెజరనో, ఆమె భర్త ఎరిక్ గార్డేరె చనిపోయిందనుకుంటున్న బిడ్డకు పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు.  ఆ బిడ్డ చనిపోలేదని ఇటీవల తెలిసింది. తన తల్లికి బిడ్డ ఇష్టం లేకనే న్యూజెర్సీకి చెందిన దంపతులకు ఇచ్చినట్టు వెల్లడైంది. ప్రస్తుతం బెజరనో జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. 

కాగా ప్రస్తుతం క్రిస్టన్ పెళ్లి చేసుకొని భార్య, కొడుతో కలిసి జీవిస్తున్నాడు. నవంబర్‌లో అతన్ని తొలిసారి తాము కలవబోతున్నామంటూ బెజరనో జంట చెబుతున్నారు. చనిపోయిందనుకున్న బిడ్డ తిరిగి వస్తుండటంతో అతని రాక కోసం ఎదురుచూస్తున్నారు. క్రిస్టిన్‌ ప్రతి రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు.