భర్తతో విడిపోయినా అత్తింట్లో ఉండొచ్చు : సుప్రీం - MicTv.in - Telugu News
mictv telugu

భర్తతో విడిపోయినా అత్తింట్లో ఉండొచ్చు : సుప్రీం

October 17, 2020

trump01

వైవాహిక బంధంలో వివాదాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకొని భార్య, భర్త ఎవరి దారి వారు చూసుకుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే మాజీ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింట్లోనో లేదా వేరే విడిగానో ఉంటారు. అయితే వారు కావాలంటే అత్తింట్లో ఉండే అవకాశం ఉంటుందని సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. భర్తతో విడిపోయినా, అత్తింటి వారు అంగీకరిస్తే ఆమె ఇంట్లో ఉండేందుకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన బయటకు పంపిచే అవకాశం లేదని తేల్చి చెప్పింది. 

స్నేహ అహుజా అనే మహిళ రవీన్ అహుజా నుంచి 2019లో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ ఆమె అత్తింటిలో ఉండేందుకు మామా సతీష్ చందర్ అహుజా అంగీకరించాడు. దీనికి అతడి కొడుకు అభ్యంతరం చెప్పడంతో కోర్టును ఆశ్రయించాడు. తాను సంపాధించిన ఆస్తిలో కొడుక్కు వాటా లేదని, తన మాజీ కోడలు తమ వద్దే ఉంటుందని పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అంగీకరించింది. స్నేహ అహుజాకు నివాస హక్కు ఉందని తీర్పు ఇచ్చింది. విడిపోయిన అత్తమామల ఇంటిలో ఉండటానికి మహిళకు హక్కు ఉందని, దాన్ని తొలగించలేమని అభిప్రాయపడింది. దీంతో ఈ తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.