మూసేసిన దుకాణాలను దోచేస్తున్న లేడీ - MicTv.in - Telugu News
mictv telugu

మూసేసిన దుకాణాలను దోచేస్తున్న లేడీ

May 20, 2020

woman

లాక్ డౌన్ కారణంగా తిరుమల నిర్మానుష్యంగా మారింది. దర్శనాలకు అనుమతి లేకపోవడంతో భక్తులు ఎవ్వరూ తిరుమలకు రావడం లేదు. లాక్ డౌన్ లో భాగంగా అక్కడి దుకాణాలు కూడా మూసేసారు. దీంతో ఓ మాయ లేడీ రెచ్చిపోయింది. అక్కడి దుకాణాల్లో చోరీలకు పాల్పడుతోంది.

తిరుమల కొండపై పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ దుకాణాలలో చోరీలకు పాల్పడుతోంది. మూసి ఉన్న దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాలపడుతోంది.ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఆ లేడీ సీసీటీవీ కెమెరాలను కూడా పగలగొట్టడం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ లేడీ కోసం గాలిస్తున్నారు.