Woman saves son from giant cobra in scary viral video from Karnataka. Watch
mictv telugu

తాచుపాము తలపై కాలేసిన బుడ్డోడు.. తల్లి వేగంగా.. వీడియో

August 13, 2022

Woman saves son from giant cobra in scary viral video from Karnataka. Watch

పెద్ద నాగుపాము బారి నుంచి ఓ తల్లి తన కుమారుడ్ని చాకచక్యంగా కాపాడింది. అక్కడ సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకుంది. ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు అతడితోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళ్తున్నది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేయబోతుండగానే ఆ అలికిడితో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది.

ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసిన కుర్రాడిని కాటువేసేందుకు పడగ ఎత్తింది. పెద్ద ఎత్తున పైకిలేచి బాలుడ్ని కాటేయబోయింది. దీంతో బాలుడు భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. తల్లి గబ్బుక్కున కిందకు దూకి వెంటనే కాటువేయబోతున్న పాము నుంచి తన కుమారుడ్ని పక్కకు లాగింది. బాలుడ్ని ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లింది. దీంతో ఆ పాము పాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. క్షణాల్లో స్పందించి పాము బారి నుంచి కుమారుడ్ని కాపాడిన ఆ తల్లిపై ప్రశంసలు కురిపించారు.