Home > క్రైమ్ > లవర్‌పై యువతి రివెంజ్..ఇరుగుపొరుగు వారికీ కన్నీళ్లు!

లవర్‌పై యువతి రివెంజ్..ఇరుగుపొరుగు వారికీ కన్నీళ్లు!

Woman

యువతి యువకులు ప్రేమిచుకోవడం సహజం. కానీ, తమ లవర్ చేతిలో మోసపోతున్నామని తెలిస్తే మాత్రం ఎదుటివారు తట్టుకోలేరు. లవర్ అని కూడా చూడకుండా మోసం చేసినవాళ్లపై రివెంజ్ తీసుకోవాలనుకుంటారు. తాజాగా చైనాలో లవర్ చేతిలో మోసపోయిన ఓ యువతి చాలా వినూత్నంగా పగ తీర్చుకుంది. షాడాంగ్ లో ఉంటున్న జావ్ అనే యువతికి చైనీయుల ప్రేమికుల రోజుగా పిలిచే 520 డే రొజున తన బాయ్‌ఫ్రెండ్ చేస్తున్న మోసం గురించి తెలిసింది. అతడు ఈమెతో ప్రేమగా వ్యవహరిస్తూ మరో యువతితో అతడు సన్నిహితంగా ఉంటున్నాడని ఆమెకు తెల్సింది. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది.

కొన్ని రోజుల పాటు ఇంట్లో కూర్చొని ఏడ్చింది. ఆమె ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే అతడు మాత్రం మరో అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడని తన స్నేహితురాళ్ళు తెలిపారు. దీంతో అతడిని కూడా ఏడిపించాలని జావ్ అనుకుంది. వెంటనే ఓ ట్రక్కు ఉల్లిపాయలను తెప్చించి తన బాయ్‌ఫ్రెండ్ ఇంటి గుమ్మం ముందు పోయించింది. నీతో కూడా కన్నీళ్లు పెట్టిస్తా అని ఓ పేపర్ పై రాసి అక్కడ వదిలిపెట్టింది. అయితే, ఉల్లిపాయల వాసన ఆ చుట్టుపక్కల అంతా వ్యాపించడంతో వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. దేనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated : 19 May 2020 10:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top