వాడికి బుద్ధిలేకపోతే చేసుకునేదానికైనా బుద్ధుండాలి కదా..  - MicTv.in - Telugu News
mictv telugu

వాడికి బుద్ధిలేకపోతే చేసుకునేదానికైనా బుద్ధుండాలి కదా.. 

May 18, 2020

mmn

కరోనా మనుషుల ప్రాణాలనే కాదు.. కాపురాలను కూడా కూల్చేస్తోంది. లాక్‌డౌన్‌ను అదునుగా చూసుకొని ఓ ఘనుడు తన భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌లో చిక్కుకొని తన భార్య ఇంటికి రావడం లేదనే కోపంతో ఈ విధంగా చేసినట్టు ఆ ప్రబుద్ధుడు సెలవిచ్చాడు. దీంతో ఈ పెళ్లి తంతు తెలిసిన వారంతా ఇదేం విడ్డూరం అంటూ చర్చించుకుంటున్నారు. 

నసీమ్ అనే మహిళకు 2013లో నయీమ్ మన్సూరీ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి  ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. లాక్ డౌన్‌కు ముందు మార్చి 19న  నసీమ్ తన  తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో లాక్‌డౌన్ విధించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహం పట్టలేని తన భర్త ఎలాగైనా రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. తీరా ఆమె రాలేదనే సాకుతో తన వంకర బుద్ధి బయటపెట్టుకున్నాడు. మరో యువతిని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. దీంతో ఆమెమేరా హక్అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. భార్య పుట్టింటి నుంచి రాకపోతే మరో పెళ్లి చేసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.