వామ్మో తేలు.. ఏకంగా విమానం ఎక్కేసిందే..! - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో తేలు.. ఏకంగా విమానం ఎక్కేసిందే..!

December 10, 2019

Woman 022

బస్సులు, రైళ్లలో తేళ్లు, పాములు, ఎలుకలు వచ్చాయనే వార్త వింటూ ఉంటాం. కానీ ఏకంగా విమానంలో ఓ తేలు ప్రత్యక్షమై అందరిని హడలెత్తించింది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. నల్లటి పెద్ద తేలు ఓ మహిళ కాళ్ల దగ్గర ప్రత్యక్షం కావడంతో వెంటనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్పందించి దాన్ని పట్టుకున్నారు. 

శాన్ ఫ్రాన్సిస్కో నుంచీ అట్లాంటాకు వెళ్లేందుకు ఓ మహిళ  విమానం ఎక్కింది. కొంత సేపటికి ఆమె కాలి వద్ద ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. ప్యాంట్ అటూ ఇటూ కదిపినాప్రయోజనం లేకపోయింది. దీంతో వెంటనే రెస్ట్‌రూంకి వెళ్లి ప్యాంట్ విప్పి చూడగా కాలి వద్ద తేలు ఫ్యాంటులోంచి కిందపడింది. వెంటనే భయంతో విషయాన్ని సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆమెకు ప్రథమ చికిత్స చేశారు అట్లాంటాలో దిగిన వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ ఘనటలో ఆ మహిళకు ఎటు వంటి ప్రమాదం జరగలేదు. కాగా విమానంలోకి విష పురుగు రావడంతో ప్రయాణికులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.