ఫ్రాడ్ అని తెలియడంతో కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ ఎస్సై - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రాడ్ అని తెలియడంతో కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ ఎస్సై

May 6, 2022

అసోంలో ఓ మహిళా ఎస్సై కాబోయే భర్తనే అరెస్ట్ చేసింది. అతని నిజస్వరూపం పెళ్లికి ముందే తెలియడంతో అదృష్టవశాత్తూ మోసపోకుండా బయటపడ్డానని సంతోషపడింది. వివరాలు.. నాగావ్ ఎస్సైగా పని చేస్తున్న జున్మోనీ రభాకు గత అక్టోబరులో రాణా పోగాగ్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయింది. వచ్చే నవంబరులో వారి పెళ్లి జరగాల్సి ఉంది. అంతకు ముందు రాణా పోగాగ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆక్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలానికి పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, రాణా పోగాగ్ ఓఎన్జీసీతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేలు సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన రభాకు రాణా గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని వెల్లడైంది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాబోయే భర్త రాణాను అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె బాధితులకు ధన్యవాదాలు తెలిపింది. వైవాహిక జీవితంలో మోసపోకుండా నన్ను కాపాడారని కృతజ్ఞతలు తెలిపింది.