ఎంత కోపమో.. ఉప ప్రధానిపై కూల్‌డ్రింక్ పోసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత కోపమో.. ఉప ప్రధానిపై కూల్‌డ్రింక్ పోసింది.. 

September 21, 2020

Woman throws cool drink on Ireland’s Deputy Prime Minister

దేశ ఉప ప్రధాని దగ్గరికి వెళ్లాలంటే ఎంతో సెక్యూరిటీని దాటుకుని వెళ్ళాలి. అలాంటిది ఓ మహిళ ఉప ప్రధానిపై కూల్ డ్రింక్ పోసింది. ఈ సంఘటన ఐర్లాండ్ దేశంలో జరిగింది. ఆ దేశ ఉపప్రధాని అయిన లియో వరద్కర్ ఇటీవల ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకొచ్చిన కొత్త మార్గర్శకాలను ప్రజలకు వివరించేందుకు జనాల్లోకి వచ్చారు. 

స్థానికంగా ఉన్న ఓ పార్కులో కరోనా నిబంధనల గురించి ఆయన ప్రజలకు వివరిస్తున్నారు, ఈ సమయంలో అటువైపుగా వచ్చిన ఓ యువతి చేతిలో ఉన్న కూల్‌ డ్రింక్‌ను లియో వరద్కర్‌పై పోసి అక్కడి నుంచి పారిపోయింది.  ఆ యువతి ఆయనపై కూల్ డ్రింక్ ఎందుకు పోసిందో తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీని గురించి లియో వరద్కర్ మాట్లాడుతూ..’ఈ ఘటనను సాకుగా చూపి, అదనపు సెక్యూరిటీని కోరలేమని’ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో వరద్కర్ భారత సంతతికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.