నువ్వు దేవుడివయ్యా... టీవీ రాముడికి పాదాభివందనం.. - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వు దేవుడివయ్యా… టీవీ రాముడికి పాదాభివందనం..

October 1, 2022

రాముడంటే ఇప్పటి తరానికి ప్రభాస్ ‘ఆదిపురుష్,’, లేకపోతే నిన్నామొన్నా వచ్చిన బాలయ్య ‘శ్రీరామపట్టాభిషేకం’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే 1990లలో టీవీలు చూసినవాళ్లకు మాత్రం రాముడంటే టీవీ రాముడే. ఆనాటి రామాయణ్ సీరియల్‌లో రాముడిగా నటించి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు అరుణ్ గోవిల్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పటి ఆయన రాముడి రూపానికి, ఇప్పటి వృద్ధరూపానికి గుర్తుపట్టలేని తేడా ఉన్నా ఆయనను చూడగానే గుర్తుపట్టే అభిమానులు చాలా మందే ఉన్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

అరుణ్ గోవిల్ ఇటీవల ఎక్కడో ఎయిర్ పోర్టుకు వెళ్లగా ఓ మహిళ ఆయనను గుర్తుపట్టి పాదాభివందనం చేసింది. కాళ్లు పట్టుకుని కళ్లకు అద్దుకుంది. ఆమె పక్కనున్న వ్యక్తి కూడా టీవీ రాముడికి పాదాభివందనం చేశాడు. తర్వాత గోవిల్ ఆమె కాషాయజెండా అందించారు. ఆమె చేతులు జోడించి ఎంతో భక్తిశ్రద్ధలతో గోవిల్‌ను నడిచే దైవంగా గౌరవించిన ఈ దృశ్యం వీడియోకు ఎక్కడంతో వైరల్ అవుతోంది. రామానంద్ సాగర్ తీసిన ఆనాటి రామాయణ్ సీరియల్ వచ్చి 35 ఏళ్లు దాటినా ప్రజల్లో అభిమానం చెరిగిపోలేదు. కరోనా సమయంలో దూరదర్శన్‌లో ఈ సీరియల్ ను పునఃప్రసారం చేయగా కోట్లమంది చూశారు.