Woman undergoing treatment for dog bite dies; Tests on to rule out rabies
mictv telugu

కుక్క కాటుతో మహిళ మృతి… టీకా పనితీరుపై..

August 23, 2022

కుక్కకాటు వల్ల రేబిస్‌ సోకి మరణాలు సంభవిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే రేబిస్‌ను నిరోధించే టీకా (రేబిస్ వ్యాక్సిన్)ను తీసుకున్నప్పటికీ ఓ మహిళ ప్రాణం దక్కలేదు. కేరళలోని పెరంబ్ర ప్రాంతానికి చెందిన పి.చంద్రిక (53) అనే మహిళను ఓ వీథి కుక్క కరిచింది. అయితే వెంటనే కొజిక్కోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరగా.. ఆమెకు రేబిస్ టీకాను ఇచ్చి, చికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె శనివారం తుది శ్వాస విడిచారు.

ఆ కుక్క కాటుకు గురైన మరో ఎనిమిది మందికి కూడా రేబిస్ టీకాలను ఇచ్చి, చికిత్స చేశారు. వారికి రేబిస్ లక్షణాలు ప్రస్తుతానికి కనిపించలేదు. టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీ ఉమర్ ఫరూఖ్ మాట్లాడుతూ.. చంద్రిక ముఖంపై వీధికుక్క దాడి చేసిందని చెబుతూ.. ఆమె మరణానికి గల కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. సరైన కారణాన్ని తెలుసుకోవడానికి మరికొన్ని పరీక్షలు చేయవలసి ఉందని చెప్పారు. రేబిస్ వల్ల ఆమె మరణించినట్లు నిర్థరణ అయితే, రెండు నెలల్లో ఈ వ్యాధితో మరణించినవారిలో ఆమె రెండో వ్యక్తి అవుతారని తెలిపారు. గత నెలలో పాలక్కాడ్‌లోని మంకరలో శ్రీలక్ష్మి (19) అనే విద్యార్థిని కుక్క కాటుకు గురై, రేబిస్ సోకి, ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.