జీపీఎస్ ఫాలో అవుతూ డ్రైవ్ చేశానంటూ ఓ మహిళ తన కారును పోలీస్ స్టేషన్ మెట్లను ఎక్కించింది. వెంటనే అప్రమత్తమైన ఆ స్టేషన్ పోలీసులు… సదరు మహిళను ప్రశ్నించగా జీపీఎస్‌ను ఫాలో అయ్యానని చెప్పింది. జీపీఎస్ చూపించిన రూట్లోనే వెళ్తున్నానని, అనుకోకుండా ఇలా జరిగిందని పోలీసులతో నమ్మబలికింది. అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమెకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయగా.. ఆ మహిళ మద్యం సేవించి కార్ డ్రైవ్ చేసినట్లు తేలింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
పోర్ట్లాండ్ పరిధిలోని పోలీసు డిపార్ట్మెంట్ గ్యారేజీ గుండా ఓ 26 ఏళ్ల మహిళా డ్రైవర్ ఎస్యూవీ కారు నడుపుకుంటూ వెళ్లింది. అంతే కాకుండా పెడెస్ట్రియన్ ప్లాజాను దాటి , ఆ తర్వాత డౌన్ స్టేర్‌లో ఉన్న పీఎస్ మెట్లను కూడా కారులో ఉండే దిగాలనుకుంది. ఈ క్రమంలో మెట్లపైనే కారు ఆగిపోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను ప్రశ్నించారు. జీపీఎస్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా తన కారు నడపుకుంటూ వెళ్లానని చెప్పిన ఆమె సమాధానం విని షాకయ్యారు. అనుమానం వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. ఆమె బ్లడ్‌లో ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే ఆమెకు సమన్లు పంపింది. అదృష్టవశాత్తు ఆ మహిళ ఎవరిని ఢీకొనలేదని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు.