5 వేల కి.మీ. దూరం నుంచి వచ్చిన ప్రియురాలిని చంపి, అమ్మేశాడు. - MicTv.in - Telugu News
mictv telugu

5 వేల కి.మీ. దూరం నుంచి వచ్చిన ప్రియురాలిని చంపి, అమ్మేశాడు.

November 26, 2022

ముక్కుమొహం తెలియని వారితో ప్రేమ కోసం ఆరాటపడి అమాయక మహిళలు బలైపోతున్నారు. కిరాతకులను గుడ్డిగా నమ్మి విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. కన్నవారిని కాదని కామాంధులను, అవకాశం చూసి కాటేసే నాగులను నమ్మి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడి కోసం 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఓ యువతి వెళ్తే..ఆమె హత్యను చేసి అవయవాలను అమ్ముకున్నాడు ఆ దుర్మార్గుడు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన శ్రద్ధా వాకర్ హత్య గురించి అందరికి తెలిసిందే..ప్రియుడు అఫ్తాబ్ ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ముక్కముక్కలుగా నరికి సూట్‌కేసులో పెట్టి బయటపారేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనే మరొకటి పెరూ దేశంలో చోటచేసుకుంది.
ఆన్‌లైన్‌లో పరిచయమైన ప్రియుడి కోసం బ్లాంకా అరెల్లానో అనే 51 ఏళ్ల మహిళ మెక్సికో నుంచి పెరూకు దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లింది. వారం రోజుల పాటు వారిద్దరు సరదాగా గడిపారు. తర్వాత అతడిలో ఉన్న ఉన్మాదం బయటకొచ్చింది. ఆమెను దారుణంగా హత్య చేశాడు. అవయవాలను కోసి అమ్మేశాడు. నవంబర్ 7 తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్‌లో స్పందించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ప్రియుడు జువాన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. షాకింగ్ నిజం వెలుగుచూసింది. అవయవాలు అమ్ముకునేందుకు తానే బ్లాంకాను హత్య చేసినట్లు జువాన్ నేరాన్ని అంగీకరించాడు.