ఏండ్లుగా శాండ్‌విచే ఆహారం.. చివరకు అరుదైన వ్యాధి సోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏండ్లుగా శాండ్‌విచే ఆహారం.. చివరకు అరుదైన వ్యాధి సోకి..

May 28, 2022

యూకే కి చెందిన 25 ఏళ్ల జోయ్ శాండ్లర్ అనే యువతి 23 ఏళ్ల పాటు కేవలం సాండ్‌విచ్‌లు తింటూ బతికేసింది. రెండేళ్ల వయసు నుంచి నిన్నా, మొన్నటివరకూ నిత్యం ఆమె బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్… అంతా సాండ్‌విచ్‌ మయమే. ఆమె తల్లిదండ్రులు కూడా లంచ్‌ బాక్స్‌లో వీటినే పెట్టి పంపేవారు. క్రమంగా ఆమెకు ఇతర ఆహార పదార్థాలపై ఇష్టం పోయింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు ‘మల్టిపుల్‌ స్లెరోసిస్‌’ అనే వ్యాధి సోకింది. దానివల్ల బ్రెయిన్, కండరాలు ఎఫెక్ట్ అయ్యాయి. డాక్టర్లు జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిందేనని తెలిపారు.

దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను హిప్నాథెరపిస్ట్‌ దగ్గరికి తీసుకువెళ్లి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. రిస్ట్రిక్టెడ్ ఫుడ్ డిజార్డర్తో బాధపడుతోందని చెప్పిన ఆ డాక్టర్.. పండ్లు, కూరగాయలు తినేలా కౌన్సిలింగ్ చేశాడు. తొలిసారి భోజనం చేసిన ఆమె తన అనుభూతిని పంచుకుంది. ‘స్ట్రాబెరీలు ఇంత రుచిగా ఉంటాయని అనుకోలేదు. మిగతా ఆహారపదార్థాలను కూడా తినడానికి నేను ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏడాది జరగనున్న నా పెళ్లిలో నేను వింధుభోజనం చేస్తాను’ అని తెలిపింది.