Woman who spents lakshs to possess the world’s biggest lips
mictv telugu

పే…ద్ద పెదవులకు లక్షల్లో ఖర్చు!

November 22, 2022

ఆడ, మగ అనే తేడా లేదు. ఎవరైనా అందంగా ఉండడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆండ్రియా అనే ఆమె సరికొత్త రికార్డు సృష్టించాలని లక్షల్లో ఖర్చు చేస్తున్నది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

ఆండ్రియా అందరి అమ్మాయిల్లాగే అందంగా ఉండాలని కోరుకునేది. కాకపోతే ఇతరులతో పోలిస్తే తాను భిన్నంగా ఉండాలని ఆశపడేది. ఆ ఆశే ఆమె పలు సర్జరీలు చేయించుకునేలా చేస్తున్నది. 2018లో మొదటిసారి తన మీద కత్తిగాటు పడేలా చేసుకున్నది. అలా ఆమె ముఖం, ఛాతీ మీద ఎన్నోగాట్లు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 9వేల డాలర్లు అంటే సుమారు 7.5లక్షల పైనే ఖర్చు చేసింది. దీనికోసం 32 ప్రక్రియలను చేయించింది. వీటితోనే ఈ సర్జరీలకు ఈమె ముగింపు పలకడం లేదట. భవిష్యత్తులో మరిన్ని చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటున్నది.

బ్రెస్ట్ సర్జరీ కూడా చేయించుకున్న ఆమె ఒంట్లోకి మరొక ఇంజక్షన్ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు డాక్టర్లు. తన పెదవుల వల్ల ఇప్పటికే ముక్కులు మూసుకుపోయి చాలా ఇబ్బందులు పడుతుంది. తినడానికి కూడా సరిగా కావడం లేదు. ఆండ్రియా ‘నా డాక్టర్ నేను ఇప్పటికే ఎక్కువగా ఫిల్లర్లను ఉపయోగిస్తున్నానని అంటున్నారు. చెంపలతో మొదలైన నా ఈ ప్రక్రియ.. పెదవులతోనే ఆపేయాలనుకోవడం లేదు.

నా పెదవులంటే నాకు చాలా ఇష్టం. వాటితో రికార్డు సాధించాలని అనుకుంటున్నా’ అంటున్నది. ‘ఎంత ఖర్చు చేశానన్నది కాదు.. నేను అనుకున్నట్టుగా నేను మారానా? లేదా? అన్నదే ముఖ్యం. దీనికోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తా. ఎంత నొప్పినైనా భరిస్తా’ అంటున్నది ఆండ్రియా.
చాలామంది ఈమె పెదవులు చూడడానికి సోషల్ మీడియాలో తెగ ఎగబడుతున్నారు. ఇన్స్టాలో, టిక్టాక్లో ఆమె ఫాలోవర్ల సంఖ్యే చూస్తుంటే అర్థమైపోతుంది. ఆమె ఫాలోవర్లలో కొందరు ఆమెను తెగ ఆరాధిస్తున్నారట. చాలామంది ఆమెను కలువాలని, ఆమెతో ట్రావెల్ చేయాలని అడుగుతున్నారట. ఇందులో ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లను ఆండ్రియా అస్సలు పట్టించుకోను అని చెబుతున్నది.