నాలుకను ఒకేసారి రెండు గ్లాసుల్లో పెట్టి జుర్రేసింది... - MicTv.in - Telugu News
mictv telugu

నాలుకను ఒకేసారి రెండు గ్లాసుల్లో పెట్టి జుర్రేసింది…

May 13, 2022

పైనున్న ఫోటో చూస్తే ఓకేసారి రెండు గ్లాస్‌లలో ఉన్న డ్రింక్స్ ఎలా టేస్ట్ చేస్తారన్న డౌట్ రావొచ్చు. ఇది అందరికీ సాధ్యం కాకపోవొచ్చు కానీ ఆమెకు మాత్రం చాలా తేలిక. కారణం ఆమెది చీలిన నాలుక. అంటే ఒకే నాలికని రెండుగా కట్ చేయించుకుంది.
కాలిఫోర్నియాకు చెందిన ఈ మహిళ బ్రియన్నా మేరీ షిహాదే. ఆమె ఒక డ్రెడ్‌లాక్ ఆర్టిస్ట్ . డ్రెడ్‌లాక్ అనేది ఓ రకమైన హెయిర్ స్టైల్. ఇది పాటించేవాళ్లు జుట్టు దువ్వుకోరు. పెరిగేకొద్దీ దాన్ని చిన్న చిన్న పాయలుగా చేసుకుంటారు.

వాటికి పూసలు, రింగులూ తగిలించుకుంటారు. రకరకాల రంగులు, డైలూ వేయించుకుంటారు. ఇలాంటి పని చేయడంలో బ్రియన్నా ఫేమస్. ఆమె ఫాలోయర్ ఒకరు.. చీలిన నాలుకతో ఒకేసారి పెప్సీ, కోకాకోలా డ్రింక్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమని అడిగాడు. దాంతో ఆమె ముందుగా… ఓ గ్లాస్‌లో మినరల్ వాటర్, మరో గ్లాస్‌లో స్ప్రైట్ డ్రింక్ వేసి టేస్ట్ చూసింది. ఆ తర్వాత ఓ గ్లాస్‌లో పెప్పీ, మరో గ్లాస్‌లో కోకాకోలా వేసి టేస్ట్ చూసింది. చివరకు పెప్సీ, కోకాకోలా రెండూ ఒకేలా ఉన్నాయని చెప్పింది.