ఆడవాళ్లూ మీకు జోహార్లు.. యశోద మూవీ టీం వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఆడవాళ్లూ మీకు జోహార్లు.. యశోద మూవీ టీం వీడియో

March 8, 2022

JAGAN

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రసీమలోని యాక్టర్లు సైతం స్పందిస్తూ, తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత కథనాయికగా నటిస్తున్న ‘యశోద’ మూవీ టీం ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. సినిమా కోసం పనిచేస్తున్న నటీమణులు, టెక్నీషియన్లతో ఈ వీడియో రూపొందించింది. వీరిలో యాక్టర్లతోపాటు శారీరక శ్రమచేసే మహిళలు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పనిచేసే స్త్రీలను గౌరవిస్తూ, మూవీ టీం వీడియో రూపొందించడం అభినందనీయమని పలువురు అభినందిస్తున్నారు.