అమెరికోళ్ల దీపావళి.. కెవ్వుకేకలు (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికోళ్ల దీపావళి.. కెవ్వుకేకలు (వీడియో) 

October 27, 2019

Women at the American Embassy welcome Diwali with dance

అమెరికన్లు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భారతీయ వస్త్రాధారణతో అతివలు దీపావళి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మన బాలీవుడ్ పాటలకు చిందులేస్తూ చూడముచ్చటగా జరుపుకున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో శనివారం ఈ వేడుక జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి సంబరాలు ఆదివారం జరుపుకుంటే.. అమెరికా రాయబార కార్యాలయంలో మాత్రం ఓ రోజు ముందుగానే వేడుకలు ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ చిత్రం సత్యమేవ జయతేలోని దిల్‌బర్ పాటకి అమెరికన్ మహిళా సిబ్బంది చేసిన నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. పాటకు అనుగుణంగా వారు వేసిన స్టెప్పులు అక్కడివారిని ఆకట్టుకున్నాయి. దీంతో ఈలలు వేస్తూ వారిని ఉత్సాహపరిచారు. 

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ఉత్సవాలకు సంబంధించిన వీడియోను వారు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారతీయులంతా పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతీయుల సంప్రదాయాలను గౌరవిస్తూ.. దీపావళి వేడుకలు జరుపుకుంటున్న అమెరికన్లది నిజంగా గొప్ప మనసు అని కామెంట్లు చేస్తున్నారు.