లేడీస్ ఎందుకంత షార్ప్! - MicTv.in - Telugu News
mictv telugu

లేడీస్ ఎందుకంత షార్ప్!

August 30, 2017

ఆడవాళ్ల గురించి ఇంకాస్త లోతుగా తెల్సుకోవాలని అనుకునేవాళ్ల కోసమే ఈ వార్త. ఆడవాళ్లు మగవారి కంటే చాలా విషయాల్లో చాలా షార్ప్ గా ఉంటారు.  విషయాన్ని వెంటనే గుర్తిస్తారు.  చదువుల్లో కూడా వారే టాప్ లో ఉంటారు. దానికి రకరకాల కారణాలు చెప్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ  పరిశోధకులు  స్టడీ చేసి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు.

మగ వారి కంటే ఆడవాళ్లు  ఒక పాళ్లు తెలివైన వాళ్లేనట.  కొన్నింట  కాదు అన్నింటా వారే తెలివిగల వారని తేలింది. మతి మరుపు, నిద్రలేమితనం, మానసిక ఒత్తిడి, ఆందోళన, భావోద్రేకం వంటి అంశాల గురించి  స్త్రీ, పురుషుల మధ్య తేడాలను గుర్తించారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 46 వేల మెదళ్లను స్కానింగ్ చేశారట. భావోద్రేకాలను  మెదడు నియంత్రించే ప్రాంతాల్లోనే స్త్రీల మెదళ్లు మగవాళ్ల కన్నా చురుగ్గా పనిచేస్తున్నాయట. అల్జీమర్స్, నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లకు మహిళలే ఎక్కువగా గరవుతున్నారట.

కొన్ని విషయాల్లో మగ వారి కంటే ఆడవారి మెదడు చాలా చురుక్కగా పనిచేస్తున్నదట.చదువు, ఉద్యోగాలు,  సామాజిక సమస్యలు ఇతరత్రా అంశాలను గుర్తించడం, అవగాహన చేసుకోవడంలో  ఆడవారి మెదడు చురుగ్గా ఉందట. ఓవరాల్ గా ఆడవారి మెదడుకు చాలా పదును ఉందని తేల్చారు  పరిశోధన చేసిన  సైంటిస్టులు.