హైదరాబాద్‌లో ఆడవాళ్ల సిగరెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఆడవాళ్ల సిగరెట్లు

December 3, 2017

ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరు. నవతరం యువతులు.. యువకులతో సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు.. మందు, సిగరెట్.. అన్నింటిని రుచిచూస్తున్నారు. హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిగరెట్లను ఊదిపారేస్తున్నారు. కొందరు రొటీన్ దేశీ బ్రాండ్లపై కాకుండా విదేశీ బ్రాండ్లపైనే  మక్కువ చూపుతున్నారు.దీన్ని అవకాశంగా తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రఖ్యాతిగాంచిన ఆడవాళ్ల ‘మోండ్’ బ్రాండ్ సిగరెట్లను భాగ్యనగర భామల కోసం కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటిని దుబాయ్ నుంచి మొదట ముంబైకి సముద్రమార్గంలో తరలించి, తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. పోలీసులు శనివారం దుబాయ్ నుంచి ఇక్కడికి అక్రమంగా తరలించిన మోండ్ సిగరెట్ ప్యాకేజీలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్‌లో ఇవి బయటపడ్డాయి. దుబాయ్‌లో మోండ్ ప్యాకెట్ రూ. 400 పలుకుతుండగా… స్మగ్లర్లు హైదరాబాద్ మహిళల కోసం రూ. 200 నుంచి రూ. 300కే అమ్ముతున్నారని దర్యాప్తులో తేలింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లలో గమ్, గమ్ మింగ్, గ్రీన్ యాపిల్, మెంథాల్, పాన్ వంటి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి.

సీజ్ చేసిన ప్యాకేజీల్లో లండన్ నుంచి స్మగ్లింగ్ చేసిన బెన్సన్ అండ్ హెడ్జెస్ బ్రాండ్ సూపర్ ఫిల్టర్ సిగరెట్లు కూడా న్నాయి. మొత్తం రూ. 6.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు సాగుతోందని చెప్పారు. వీటిని కేవలం ఆడవాళ్లకు అమ్మడానికే స్మగ్లింగ్ చేశారని చెప్పారు.