టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలి.. జాతీయ మహిళా కమిషన్ డిమాండ్  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలి.. జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ 

May 19, 2020

mdgb

టిక్ టాక్  ప్రస్తుతం యూత్‌లో ఎక్కువ క్రేజ్ సంపాధించుకుంది. వీడియోలు పోస్ట్ చేస్తూ.. లైకులు,షేర్స్ అంటూ చాలా మంది దాని మైకంలోనే పడిపోతున్నారు. తొలినాళ్లలో సరదాగా ప్రారంభమైన ఈ యాప్ ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. యువతను పెడదోవ పట్టించడంతో పాటు అశ్లీలత ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే దీన్ని బ్యాన్ చేయాలంటూ చాలా రోజులుగా డిమాండ్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. ఈ యాప్ తీరుపై చైర్పర్సన్ రేఖా శర్మ ధ్వజమెత్తారు. 

టిక్‌టాక్‌ యాప్‌ను మన దేశంలో పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తానని స్పష్టం చేశారు. దీని ద్వారా సమాజంలో చెడు ప్రభావం చూపెడుతోందని పేర్కొన్నారు. ఇది హింసను రెచ్చగొట్టే విధంగా తయారవుతోంది. మహిళలపై అత్యాచార వీడియోలు యాసిడ్‌ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్‌లో వీడియోలు కూడా ప్రత్యక్షమౌతున్నాయని పేర్కొన్నారు.బీజేపీ నేత తాజిం టిక్‌టాక్‌లో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యాసిడ్ దాడులను ప్రోత్సహించేలా ఫైజల్‌ సిద్దిఖీ అనే వ్యక్తి పోస్టు చేసిన వీడియోపై మహారాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు. 13.4 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నందున వారిపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకవోాలని కోరారు.  దేశం నుంచి పూర్తిగా దీన్ని నిషేధించడమే మంచిదని రేఖా శర్మ అభిప్రాయపడ్డారు.