50-year-old floating restaurant submerged in the sea
mictv telugu

సముద్రంలో మునిగిపోయిన 50ఏళ్ల ఫ్లోటింగ్ రెస్టారెంట్

June 21, 2022

Women Congress president spit on police in delhi

హాంకాంగ్‌కు చెందిన అతిపెద్ద ఫ్లోటింగ్ రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 50 ఏళ్లు సేవలందించిన ఈ నౌక మునిగిపోవడంపై నౌక కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. శనివారం పారాసెల్ ఐలాండ్స్ మీదుగా వెళ్తుండగా, ప్రతికూల వాతావరణం ఎదురవడంతో నౌకలోకి నీళ్లు వచ్చాయి. దాంతో క్రమంగా మునిగిపోవడం ప్రారంభమైందని, అయితే సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని కంపెనీ వెల్లడించింది.

రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆదివారం పూర్తిగా మునిగిపోయిందని తెలిపింది. నౌకలో ఇప్పటివరకు దాదాపు 3 బిలియన్ల మంది ఆతిథ్యం స్వీకరించగా, కరోనా తర్వాత బిజినెస్ చాలా దెబ్బతిన్నది. దీంతో కంపెనీ చాలా ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంది. కాగా, జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా కనిపించిన ఈ నౌకలో క్వీన్ ఎలిజబెత్, హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ వంటి ధనవంతులు, గొప్పవారు ఈ నౌకలో డిన్నర్ చేశారు.