Women Congress president spit on police in delhi
mictv telugu

పోలీసులపై ఉమ్మేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు.. వీడియో వైరల్

June 21, 2022

Women Congress president spit on police in delhi

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ వైఖరికి నిరసనగా ఆ పార్టీ నేతలు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని నిలువరించే ప్రయత్నం చేయగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పోలీసులపై ఉమ్మేశారు.

మొదట నిరసన తెలుపుతున్న పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషనుకి తరలించారు. అక్కడికి చేరుకున్నాక, నేతలను వ్యాన్ నుంచి దింపే క్రమంలో డిసౌజాను తొందరపెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన డిసౌజా.. కోపం పట్టలేక మహిళా కానిస్టేబుల్‌పై ఉమ్మేశారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న పోలీసులు డిసౌజాను వ్యాన్ లోపలే ఉంచి డోర్ మూసివేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.