మద్యం కోసం మహిళల ధర్నా... రాస్తారోకో...... - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం కోసం మహిళల ధర్నా… రాస్తారోకో……

July 8, 2017

మందు షాపు కోసం మహిళల ధర్నా… రాస్తారోకో…. ఏందీ విషయం చాలా ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారా… ముందు మేమూ ఇట్లాగే అనుకున్నాం. కానీ ఇది నిజమే. అరే అదేంటి… మన దగ్గర మద్యం షాపులు వద్దని కదా ఆందోళన చేస్తారు… మరి వీరెవరు… ఎందుకిట్లా చేస్తున్నారనే కదా మీ డౌట్….

తమిళనాడు రాష్ట్రం తిరువూరు జిల్లా తనీర్ పండాల్ గ్రామంలో మద్యం షాపును ఎత్తేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విషయం తెల్సిన వెంటనే అమ్మలక్కలు అంతా కల్సి రోడ్డుపైకెక్కారు. మద్యం షాపు తమ గ్రామంలో ఉంచాల్సిందేనని పట్టుపట్టారు. అయినా వినక పోవడంతో రాస్తారోకోకు దిగారు. మద్యం షాపు తమ గ్రామంలో లేక పోతే తమ భర్తలు తాగేందుకు మందు లేక తీవ్ర ఇబ్బందులు పడ్తారని తెగ బాధపడుతున్నారు.

ఎక్కడో దూరంగా ఉన్న షాపుకెళ్లి తాగి ప్రమాదాల భారిన పడ్తారని ఇంటి ఆడవారి ఆవేదన. అందుకే షాపు తమ గ్రామంలోనే ఉంటే… ఓ సుక్క  వేసుకుని హాయిగా  ఇంటికొస్తారని ఈ మగువల ఆర్గ్యూమెంట్.  భర్తల ఆరోగ్యం కోసం మందు వద్దని మన దగ్గర ఆందోళన చేస్తే… ఈ అమ్మలక్కలు మాత్రం సుక్క ఎట్లాగూ వేసుకుంటారు… అదేదో ఇక్కడే కానిస్తే పోలా అని అంటున్నారు. ఎట్లా చూసినా ఆడవాళ్లకే కష్టం ఉన్నట్లుంది.