ఈ వార్త లేడీస్ స్పెషల్..వాళ్లకు బిగ్ రిలీఫ్ నిచ్చేది..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వార్త లేడీస్ స్పెషల్..వాళ్లకు బిగ్ రిలీఫ్ నిచ్చేది..!

July 12, 2017

ఇక మహిళా ఉద్యోగులు ఆ విషయంలో లీవు కోసం అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా సెలవు అడగాలో టెన్షన్ అక్కర్లేదు లేదు. పీరియడ్స్ రోజు బిందాస్ గా సెలవు తీసుకోవచ్చు… ఈ రూల్ పెట్టింది ఏ సర్కారో కాదు…ఓ ప్రైవేట్ కంపెనీ..కానీ దీన్ని ప్రభుత్వ సంస్థలతోపాటు అన్ని ప్రైవేట్ కంపెనీలు పాటించాల్సిందే..రూల్ గీల్ లేకపోయినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవత దృక్పథంలో ఆలోచించాలి.ఎందుకంటే…

పీరియడ్స్ డేస్ లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులపై సోషల్ వీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో వాళ్లు పడుతున్న కష్టాలపై ఫోకస్ చేశారు. వైరల్‌గా మారిన వీడియోకు ఓ కంపెనీ సానుకూలంగా స్పందించింది. నెలసరి ప్రారంభమైన రోజును మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్లు ముంబైకి చెందిన కల్చర్ మెషిన్ అనే డిజిటల్ మీడియా కంపెనీ ప్రకటించింది. ఈ కొత్తవిధానం కింద జూలైలో 75 మంది ఉద్యోగినులు సెలవుకు అప్లయ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి సెలవు విధానం తీసుకురావాలని కోరుకునే వారు వీడియోకు లైక్ కొట్టాలని కల్చర్ మెసిన్ ఆన్ చేంజ్.ఓఆర్‌జీలో వీడియోను పోస్టుచేసింది. ఇంకెందుకు ఆలస్యం మహిళా ఉద్యోగినులూ…మీరూ ఓ లైక్ కొట్టేయండి. మగరాయుడ్లూ..మానవత దృక్పథంతో లైక్ చేయండి.. ఆడవాళ్లు జిందాబాద్ అని నినదించకపోయిన సరే లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలు కూడా పీరియడ్స్ రోజుల్లో పేయిడ్ హాలీడే ప్రకటించేలా ఒత్తిడి తేచ్చేందుకు…ఆల్ ది బెస్ట్ లేడీ ఎంప్లాయిస్…