భర్తతో ఉండలేకపోతున్నా..సోనూసూద్‌కి మహిళ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

భర్తతో ఉండలేకపోతున్నా..సోనూసూద్‌కి మహిళ ట్వీట్

June 2, 2020

soonu

నటుడు సోనూ సూద్ వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడంలో ఎంతో కృషి చేస్తున్న సంగతి తెల్సిందే. ఒడిశాకు చెందిన కొందరు అమ్మాయిలు లాక్ డౌన్ కారణంగా కేరళలో చిక్కుకుంటే ప్రత్యేక విమాన ఏర్పాటు చేసి వాళ్ళను స్వరాష్ట్రానికి పంపించారు. అలాగే లాక్ డౌన్ లో చిక్కుకున్నామని ఎవ్వరు ట్వీట్ చేసిన వెంటనే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సోనూ సూద్ కి వెరైటీ ట్వీట్ చేసింది.

జనతా కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ 4.0 వరకు నా భర్తతోనే ఉంటున్నా. నా భర్తతో కలిసి ఉండలేను. దయచేసి నా భర్తనైనా వాళ్లింటికి పంపించండి.. లేదా నన్నైనా పుట్టింటికి పంపించండని సదరు మహిళ ట్వీట్ లో పేర్కొంది. దీనికి సోనూ సూద్ స్పందిస్తూ..నా దగ్గర మంచి ఉపాయం ఉంది. మీరిద్దరినీ గోవా పంపిస్తాను. మీరేమంటారు.. అని సరదాగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.