Women gave mud bath to BJP MLA for rains
mictv telugu

వానల కోసం బీజేపీ ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించిన మహిళలు

July 14, 2022

రుతుపవనాల రాకకు అల్పపీడనం తోడవడంతో దేశవ్యాప్తంగా భీబత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నామో తెలిసిందే. కానీ, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు వర్షం పడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ ప్రాంతం ఈ కోవకు చెందుతుంది. వర్షాలు పడక, వరి దిగుబడి మీద ప్రభావం చూపుతుందని అక్కడి మహిళలు తమ సాంప్రదాయాన్ని పాటించారు. అందులో భాగంగా, ఇంద్రుడిని సంతోష పెట్టేందుకని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, నగర పాలక చైర్మెన్‌లకు బురద నీటితో స్నానం చేయించారు. వర్షాలు సరిగ్గా పడనప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక మహిళ మున్నీ తెలిపింది. స్థానికంగా ఈ ఆచారాన్ని కల్ కలూటి అని పిలుస్తారని పేర్కొంది. కరువు పరిస్థితులు పోవాలని, వానలు పడి పంటలు మంచిగా పండాలనే ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమం ఆనాదిగా వస్తుందని ఎమ్మెల్యే కనోజియ వెల్లడించారు. ఈ మట్టి స్నానం ప్రజల కోసం చేయడం తనకు ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఆసక్తికరంగా ఉంది.