పాతబస్తీ మూసీ ఒడ్డున గ్యాంగ్ రేప్  - MicTv.in - Telugu News
mictv telugu

పాతబస్తీ మూసీ ఒడ్డున గ్యాంగ్ రేప్ 

July 29, 2020

Women in Hyderabad

హైదరాబాద్‌లోని మూసి నది ఒడ్డున దారుణం జరిగింది. ఎవరూ లేని ఒంటరి మహిళపై కొంత మంది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

వంటమనిషిగా పని చేసుకుంటూ జీవించే 25 ఏళ్ల మహిళ గతంలో సికింద్రాబాద్‌లో జీవించేది.  ఇటీవల ఉపాధి లేకపోవడంతో పాతబస్తీలోని మూసీ నది పక్కనే ఉన్నకాళీ మందిరంలో ఉంటోంది. ఈ క్రమంలో మూసీనది ఒడ్డున దుస్తులు ఆరేయడానికి ఒంటరిగా వెళ్లింది. ఆమెను గమనించిన ముగ్గురు వ్యక్తిలు నిర్భందించారు. బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు ఆఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.