కక్షతో బాలుడిపై అత్యాచారం చేసిన ఎయిడ్స్ మహిళా రోగి - MicTv.in - Telugu News
mictv telugu

కక్షతో బాలుడిపై అత్యాచారం చేసిన ఎయిడ్స్ మహిళా రోగి

April 5, 2022

vvvv

ఎయిడ్స్ వ్యాధి సోకిన ఓ మహిళ తన కొడుకు వరసయ్యే పదిహేనేళ్ల బాలుడిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. వాళ్ల మీద కక్షతో, ఎయిడ్స్ అంటించాలనే దురుద్దేశంతో ఈ పని చేసినట్టు ఒప్పుకుంది. యూపీలో జరిగిన ఈ ఘటన వివరాలు.. ఉద్ధం సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే 23 ఏళ్ల మహిళ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకి ఆమె భర్త గత ఏడాది చనిపోయాడు. ఈ క్రమంలో భర్త చనిపోయిన మహిళ తన స్వగ్రామం ఫిలిబిత్‌కు చేరుకుంది. మహిళ భర్త సోదరుడు వేరే గ్రామంలో ఉంటున్నాడు.

ఆయన పదిహేనేళ్ల కొడుకు పెదనాన్న కర్మకాండలు నిర్వహించేందుకు ఫిలిబిత్ చేరుకున్నాడు. ఈ సమయంలో ఎయిడ్స్ వల్ల అనుభవిస్తున్న తన పరిస్థితికీ, సంతోషంగా కాలం గడుపుతున్న తన మరిది కుటుంబ పరిస్థితిని పోల్చి చూసి సదరు మహిళ కక్ష పెంచుకుంది. ఈ నేపథ్యంలో తన ఇంటికి వచ్చిన బాలుడిని పలుమార్లు అత్యాచారం చేసింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించింది. బెదిరిన బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నా.. ఈ విషయం బయటపెట్టలేదు. కొన్ని రోజులకు ఎయిడ్స్ మహిళ బాలుడిని చూసేందుకు తన మరిది ఇంటికి వెళ్లింది. మళ్లీ బాలుడిపై అత్యాచారం చేయగా, ఈ సారి ఆ బాలుడు విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పేశాడు. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎయిడ్స్ మహిళను అరెస్ట్ చేశారు. వ్యాధిని మరిది కుటుంబంలోని అందరికీ అంటించాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. అనంతరం నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.