Women JAC leaders complaint to AP Governor about YCP MP Gorantla video
mictv telugu

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియోపై ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు

August 12, 2022

Women JAC leaders complaint to AP Governor about YCP MP Gorantla video

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారాన్ని మహిళా జేఏసీ నేతలు గవర్నర్ బిశ్వ భూషణ్ హరించదన్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌ల‌కు చెందిన మ‌హిళా నేత‌లంతా క‌లిసి మ‌హిళా జేఏసీ పేరిట శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌కు ఓ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింద‌ని చెప్పిన మ‌హిళా జేఏసీ… ఈ వ్య‌వ‌హారం మ‌హిళా లోకానికే సిగ్గు చేట‌ని ఆరోపించారు.
మాధవ్‌కు క్లీన్ చిట్ ఇచ్చేలా అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాధవ్‌ను వైసీపీ ప్రభుత్వం, పోలీసులు రక్షిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించి నిజాలు నిగ్గు తేల్చాల‌ని, నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో గ‌వ‌ర్న‌ర్‌కు ఉండే విశేషాధికారాల‌ను వినియోగించాల‌ని ఈ సంద‌ర్భంగా వారు బిశ్వ‌భూష‌ణ్‌ను కోరారు.

మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె స్పీకర్‌కు లేఖ రాశారు. మహిళ అనుమతి లేకుండానే మాధవ్‌ అసభ్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. వీడియో అసభ్యకరంగా, అశ్లీలంగా ఉందని తెలిపారు. మాధవ్‌ వీడియో ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఏపీ డీజీపీకి కూడా ఆమె లేఖ రాశారు.