పాకిస్తాన్లో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మామపై కోడలు అత్యాచారం చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గుజ్రాన్వాలా జిల్లాలోని అరూప్ పట్టణంలో ఈ నెల 9న జరిగింది. అంతా ముందుగా సహజ మరణం అనుకున్నా కూడా పోస్టుమార్టం నివేధికతో ఈ విషయం బయటపడింది. దీంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
గులామ్ హసన్ (80) ఇటీవల ఆకస్మికంగా మరణించాడు. అంతా సహజ మరణం అనుకున్నారు. అయితే కోడుకు బిలాల్ హసన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్టుమార్టం చేయగా అతడి భార్య నహీద్, గులామ్ హసన్ పై అత్యాచారానికి ఒడిగట్టిందని తేలింది. బలవంతంగా ఏడుసార్లు లైంగిక చర్యల్లో పాల్గొనడంతో శరీరం బలహీనమై, డీ హైడ్రేషన్‌కు గురై, గుండెపోటుతో మరణించాడని స్పష్టమైంది. పోస్టుమార్టం నివేధిక ఆధారంగా ఆమెను ప్రశ్నించగా ఈ విషయం చెప్పింది. కాగా, ఆమె మామతో రెండు నెలలుగా లైంగిక చర్యల్లో పాల్గొంటోందని పోలీసులు వెల్లడించారు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయం బయటకు రాలేదని తెలిపారు.