రిటైర్డ్ మహిళా ఎస్ఐపై గ్యాంగ్‌రేప్..షెల్టర్ హోంలోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

రిటైర్డ్ మహిళా ఎస్ఐపై గ్యాంగ్‌రేప్..షెల్టర్ హోంలోనే..

May 5, 2020

Women railway sub inspector punjab

కరోనా వైరస్ ప్రబలుతోన్న సమయంలో కూడా కామాంధులు శాంతించడం లేదు. ఇప్పటికీ ఒంటరి మహిళా కనిపిస్తే అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. లాక్ డౌన్ కారణంగా షెల్టర్ హోంలో చిక్కుకుపోయిన రిటైర్డ్ ఎస్సైని గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. 

రైల్వే పోలీస్ విభాగంలో ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. ఆకస్మికంగా లాక్‌డౌన్ విధించడంతో స్థానిక జీఆర్పీ పోలీసుల సాయంతో షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిరోజ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.