మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. దీక్షను విజయవంతం చేసి తమకు మద్దతుగా నిలిచిన పార్టీలకు కవిత ధన్యవాదాలు తెలిపారు. కవిత మీడియాతో మాట్లాడుతూ ” ఈ ఆందోళన ఒక రాష్ట్రాని సంబంధించినది కాదు. చిన్నగా మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్ కోసం ఇది పోరాట సమయం. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం. మహిళలకు అవకాశం ఇస్తే అన్నింట్లో రాణిస్తారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పాసయ్యేలా అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి. మోదీ ప్రభుత్వం తలచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది”. అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనే ధ్యేయంగా తమ పోరాటం కొనసాగుతుంది అని కవిత వెల్లడించారు.