పెళ్లి కాకుండా తల్లి అయింది.. రూ.60 వేలకు బిడ్డను అమ్ముకుంది  - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కాకుండా తల్లి అయింది.. రూ.60 వేలకు బిడ్డను అమ్ముకుంది 

September 23, 2020

Women SellingHer Baby In Yadadri Bhuvanagiri

డబ్బుల కోసం ఓ తల్లి తన కన్న బిడ్డనే అమ్ముకుంది. రూ.60 వేలు తీసుకొని వేరొకరికి ఇచ్చేసింది. యాదాద్రి భువనగిరిలో ఇది జరిగింది. పుట్టిన 10 రోజులకే చిన్నారిని విక్రయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చి, ఆ తర్వాత అమ్మేయడం సంచలనంగా మారింది. 

నేరేడ్ మెట్ ప్రాంతంలో నివాసం ఉండే యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత డీఎన్ఐ టెస్టులు చేయిస్తామని అధికారులు చెప్పారు. ఇటీవల భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన ప్రసవించింది. పది రోజుల తర్వాత ఘట్‌కేసర్‌ మండలం ఎదులబాద్‌కు చెందిన వారికి రూ. 60 వేలకు విక్రయించింది.  బిడ్డ గురించి పోలీసులు ఆరా తీయగా అమ్మేసినట్టు తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. చిన్నారిని బాలల సదనంకు తరలించారు.