మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. కానీ మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించరు. ఇల్లు, పిల్లలు అంటూ తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు నిత్యం ఏదొక పనిలో బిజీగా ఉంటుంటారు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇంటిపనులు, పిల్లలను చూసుకుంటూ తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ద వహించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మహిళలు ముఖ్యంగా మాంసాహారంతోపాటు ఆకు కూరలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు సహజంగా పండుతాయి. కాబట్టి అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళలు ఈ నాలుగు రకాల ఆకుకూరలను తరుచుగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మెంతికూర:
మెంతికూరలో ఎన్నో పోషకవిలువలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెంతికూరను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండెసంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ మెంతికూరలో ఫ్లేవనాయిడ్స్ అనే సహజ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హర్మోన్ల హెచ్చుతగ్గులకు లోనవకుండా కాపాడుతాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది . అలాగే కంటి చూపు సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి మహిళలు వీలైనంత వరకు ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.
పాలకూర
పాలకూరలో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, సోడియం కంటెంట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత సమస్యల నుండి బరువు నియంత్రణ వరకు ఇతర పోషకాలతో పాటు ఆరోగ్యానికి అవసరం. మరీ ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మధుమేహంతో బాధపడే మహిళలకు ఈ పాలకూర చాలా మేలు చేస్తుంది. కాబట్టి మహిళలు పాలకూర ఆకులను మితంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. లేకపోతే, మీరు దాని సూప్ సిద్ధం చేసి తినవచ్చు.
బచ్చలి కూర
అన్ని ఆకుకూరల్లాగే బచ్చలికూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వివిధ రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వాపుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఆరోగ్యానికి పోషకాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ అధిక స్థాయిలో ఉన్నందున, ఇది శరీర బరువును తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది.