women should take supplements after crossing thirty
mictv telugu

30 ఏళ్ళ తర్వాత కచ్చితంగా వీటిని తీసుకోవాల్సిందే

February 8, 2023

women should take supplements after crossing thirty

ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన శరీరం మారుతూనే ఉంటుంది. ముప్పే ఏళ్ళ ముందు ఒకలా ఉన్న బాడీలో …ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత పురుషులు, మహిళలో హార్మోన్లు క్షీణించడం ప్రారంభమవుతుంది. గర్భధారణ, నెలసరి వంటి కారణాల వల్ల.. మగవారి కంటే ఆడవారిలో శారీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఫ్పై ఏళ్ళు దాటిన తర్వాత మహిళల పీరియడ్స్‌ నియంత్రించే ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి బాగా క్షీణీంచడం ప్రారంభమవుతుంది. 35 తర్వాత గణనీయంగా పడిపోతుంది. దీనివల్ల లావు అవ్వడం, లైంగిక కోరికలు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

హార్మోన్‌ మార్పుల వల్ల కలిగే పరిణామాలు తగ్గించడానికి, మహిళలు కొన్ని రకాల విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి.మనం బాగానే తింటున్నాం కదా, ఇంక విటమిన్లు ఎందుకులే అనుకుంటారు చాలా మంది. కానీ ఆహారం ద్వారా అందే విటమిన్లు, ఖనిజాలు 30 ఏళ్ళ తర్వాత సరిపోవు. తప్పనిసరిగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే.ఈ సప్లిమెంట్లు హార్మోన్‌, థైరాయిడ్‌ అసమతుల్యతలను సరిచేస్తాయని అన్నారు. సప్లిమెంట్స్… పీరియడ్స్‌, డెలివరీ వల్ల కలిగే రక్తహీనతను నిరోధించడానికి సహాయపడతాయని వివరించారు. ఒత్తిడి, బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ కారణంగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను కూడా ఈ సప్లిమెంట్స్‌ నిరోధిస్తాయి.

విటమిన్ బి

బీ గ్రూప్‌ విటమిన్లు శరీరంలోని అనేక ప్రక్రియలకు సహాయపడతాయి. B విటమిన్లు మనకు తగిన శక్తిని అందిస్తాయి. డిప్రెషన్‌ను దూరం చేయడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఈ విటమిన్లు తోడ్పడతాయి. విటమిన్ బి సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల మహిళల్లో.. మానసిక రుగ్మతులు దూరం అవుతాయి.

విటమిన్ డి3

విటమిన్‌ D3 నిజానికి శరీరంలోని పోషకం కంటే హార్మోన్ లాగా పనిచేస్తుంది. మన బాడీ కాల్షియం శోషించడానికి విటమిన్ D, K2 చాలా ముఖ్యం. విటమిన్ D లోపం కారణంగా కొన్ని క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్‌ డిస్‌ఆర్డర్స్‌, మానసిక రుగ్మతుల ముప్పు పెరుగుతుంది. విటమిన్ D3 + K2 ప్రతి రోజు 600-800 IU మొత్తంలో అవసరం.

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్

మన శరీరం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ను సొంతంగా తయారు చేసుకోలేదు. దాన్ని మన ఆహారం, సప్లిమెంట్స్‌ ద్వారా మాత్రమే తీసుకోగలం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ నిరాశ, అందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడానికి, దీర్ఘకాలిక ఇన్ప్లమేషన్‌తో పోరాడటానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ప్రతిరోజు శరీరానికి 1.59 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.

మెగ్నీషియం

మెగ్నీషియం మన శరీరానికి ఎంతో ముఖ్యమైన ఖనిజం. మన బాడీ.. 300 కంటే ఎక్కువ శారీరక ప్రక్రియలకు కోఫాక్టర్‌గా మెగ్నీషియంపై ఆధారపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులు కండరాల తిమ్మిరి,అలసట, మానసిక రుగ్మతలు, హైపర్‌టెన్షన్‌, వికారం, కండరాల బలహీనత వంటి సమస్యలతో బాధపడతారు. మన శరీరానికి ప్రతి రోజు 320-400 mg మెగ్నీషియం అవసరం.