Women staff beer party in Hanmakonda government hospital
mictv telugu

ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బంది బీరు పార్టీ

October 27, 2022

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని మహిళ సిబ్బంది హద్దు మీరారు. గర్భిణులకి వైద్యం చేయాల్సిన చోట.. బాధ్యత మరచి.. బయటి నుంచి వచ్చిన ఫ్రెండ్స్‌లో హాస్పిటల్‌లోనే సిట్టింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో హాస్పిటల్ లో బీర్లు పొంగించారు. తప్పతాగి చిందులేశారు. హాస్పిటల్ లో ఉన్న పేషెంట్ల బంధువులు ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అసలు నిజం బయటకు వచ్చింది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది ఇటీవల మరో ఇద్దరు బయటి మహిళలను పిలిపించి ఓ గదిలో బీర్లుతాగి చిందేశారు. పుట్టిన రోజు వేడుకల పేరిట సాయంత్రం వేళ తమ గదిలో పార్టీ చేసుకున్నారు. వీరు విందు చేసుకొనే దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. ఈ ఘటన ఆసుపత్రిలోని ఇతర సిబ్బందికి తెలిసింది. ఆసుపత్రి ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో వారు మహిళా సిబ్బందిని పిలిపించి మందలించి వదిలేసినట్టు సమాచారం. ఆసుపత్రిలో ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.