Home > Featured > టిక్‌టాక్ పిచ్చి పీక్స్.. పోలీసుల మధ్యలో దూరి

టిక్‌టాక్ పిచ్చి పీక్స్.. పోలీసుల మధ్యలో దూరి

జనాల్లో టిక్‌టాక్ యాప్ పిచ్చి రోజురోజుకూ మరింత పెరిగిపోతుంది. టీనేజ్ అమ్మాయిలు, యువతి యువకులు మాత్రమే కాకుండా గృహిణులు కూడా ఈ యాప్‌కు అలవాటు పడడం గమనార్హం. తాజాగా ఓ మహిళా వినాయక నిమజ్జన వేడుకలను తన టిక్‌టాక్ వీడియోకు వేదికగా చేసుకుంది. ఓవైపు హైదరాబాద్‌ పోలీసులు వినాయక నిమజ్జన హడావుడిలో బిజీగా ఉండగా వారి మధ్యలో దూరి చిందులేస్తూ టిక్ టాక్ వీడియో చేసింది.

హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కాప్రా చెరువు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సదరు మహిళ చందమామ కన్నుకొట్టే అంటూ పాటపాడుతూ పోలీసులతో కలిసి టిక్‌టాక్ చేసింది. అటూ ఇటూ పోలీసులు నిలబడి ఉండగా వాళ్ల మధ్యలోకి వెళ్లి డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఆమె తమ దగ్గరకి వచ్చి వీడియో చేస్తూంటే ఏమి చేయలేక నవ్వుకోవడం పోలీసులు వంతైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated : 13 Sep 2019 1:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top