8 ప్యాంట్లు ఒకదానిపై ఒకటి..అడ్డంగా దొరికిపోయింది! - MicTv.in - Telugu News
mictv telugu

8 ప్యాంట్లు ఒకదానిపై ఒకటి..అడ్డంగా దొరికిపోయింది!

November 26, 2019

విమానాశ్రమంలో కస్టమ్స్ సుంకం చెల్లించకుండా ఉండేందుకు కొందరు ప్రయాణికులు ఒకదానిపై ఒకటి ప్యాంట్లు, చొక్కాలు ధరిస్తారు. ఇలా ఎందరో దొరికిపోయారు. తాజాగా ఇదే ఉపాయాన్ని ఓ మహిళా బట్టల షాపులో ప్రయోగించి అడ్డంగా దొరికిపోయింది. వెనిజువెలలోని ఓ బట్టల దుకాణంలో ఓ మహిళా వినూత్న చోరీకి పాల్పడింది. బట్టలు కొనుక్కోవడానికి వెళ్లి కొన్ని నచ్చిన ప్యాంట్లు ఎంచుకుంది. వాటిని తీసుకొని ట్రయల్ రూమ్‌కి వెళ్ళింది. 

Venezolana robando pantalones

Posted by Raymundo Mendoza on Thursday, 14 November 2019

అక్కడ ఒకదానిపై ఒకటి ఇలా 8 ప్యాంట్లు ధరించింది. తీరా ఆమె తీరును గమనించి అనుమానం కలిగిన దుకాణ యజమానులు ఆమెను పట్టుకున్నారు. వెంటనే దుకాణంలోని బాత్ రూమ్‌లోకి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా విప్పించారు. దీంతో ఆమె చోరీ చేయాలనుకున్న ఎనిమిది ప్యాంట్లు ఒక్కొక్కటిగా బయటపడడంతో దుకాణదారులు షాకయ్యారు. ఈ తతంగం అంత కెమెరాకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మెండోజా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్‌లోడ్ చేసిన కొద్ది క్షణాల్లోనే 4.2 మిలియన్లకు పైగా వీక్షించారు.