పని ఎవరు ఎక్కువగా చేస్తారు.. ఆడవాళ్లా? మగవాళ్లా? ఒక అధ్యయనం ప్రకారం మాత్రం ఆడవాళ్లే ఎక్కువ శ్రమ పడుతారు అని తేలిపోయింది. కానీ వారి పని భారం మాత్రం లెక్కలోకి రాకుండా పోతున్నదట.
మానవ శాస్త్ర అధ్యయనం వివిధ దేశాల్లో, ముఖ్యంగా ఆసియాలోని కార్మికుల లింగ విభజన మీద అంచనా వేసింది. ఇళ్లను విడిచి పెట్టినా, కుటుంబంతో కలిసి ఉన్నా కూడా మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువ పని చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలు, బాలికలు ఉన్నారు. వీరు పని సామర్థ్యాన్ని లెక్క గట్టారు. లింగ అసమానత, లింగ డైనమిక్స్ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ అన్ని దేశాల్లో ఈ సమస్య కొనసాగుతూనే ఉందంటున్నారు. కరెంట్ బయాలజీ పీర్ రివ్యూ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయన ప్రకారం.. మగవారి కంటే మహిళలు ఎక్కువ కృషి చేస్తున్నారు. ఆసియాలో స్త్రీల పనిభారం లెక్కించబడడం లేదని కూడా ఈ అధ్యయనం చెబుతున్నది. అంతేకాదు.. ఆడవాళ్లు కొత్త పని చేసే ప్రయత్నం కూడా మగవారి కంటే ఎక్కువ చేస్తుంటారు.
పితృస్వామ్య సమాజం..
పితృస్వామ్యం కింద వివాహం చేసుకున్న మహిళలు వివాహం తర్వాత వారు ఎంత పని భారాన్ని తీసుకుంటారో చెప్పలేదు. చాలా పనులు స్త్రీ, తన భర్త.. కుటుంబం పట్ల కర్తవ్యంగా పరిగణించబడుతున్నది. ఈ పని భారంలో ఎక్కువ భాగం లెక్కించబడదు. ఒక కుటుంబంలో ఎవరు కష్టపడి పని చేస్తారో చెప్పేందుకే ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం గ్రామీణ చైనాలోని టిబెటన్ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ, పశువుల పెంపకం సమూహాలను పరిశీలించింది. పనులు మాత్రమే కాదు.. నడవడం, ఇతర విషయాల్లో కూడా మహిళలే ముందంజలో ఉన్నారని ఈ అధ్యయనం తేల్చేసింది.