టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రముఖ నేత బోండా ఉమలకు మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయానికి ఇద్దరూ స్వయంగా విచారణకు హాజరుకావాలని కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నోటీసులో ఆదేశించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో కమిషన్ చైర్మన్‌ను అడ్డుకోవగడం, వాగ్వివాదానికి దిగడం, బాధితురాలి ఆవేదనను తెలుసుకోనీయకుండా అడ్డుపడడం వంటి చేష్టలతో పాటు అత్యాచార బాధితురాలిని భయంకపితులను చేసిన సంఘటనలపై విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా, అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.