Women's Commission notices to Pawan Kalyan
mictv telugu

పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

October 22, 2022

Women's Commission notices to Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. భరణం ఇచ్చి భార్యను వదిలించుకోమని పవన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని, వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొంది.

మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. పవన్ ఉన్న స్థాయికి ఆయన చెప్పే మాటలు సమాజంపై ప్రభావం చూపిస్తాయని, ఆయన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. కాగా, కొన్ని రోజుల క్రితం పవన్ తన పెళ్లిళ్లపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన విషయం తెలిసిందే. మిగతావారిలా తాను ఒక పెళ్లి చేసుకొని ముప్పై మందితో తిరగడం లేదని, అధికారికంగా విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని కౌంటర్ ఇచ్చారు.