కామన్వెల్త్‌లోకి క్రికెట్.. 24 ఏళ్ల తర్వాత - MicTv.in - Telugu News
mictv telugu

కామన్వెల్త్‌లోకి క్రికెట్.. 24 ఏళ్ల తర్వాత

August 13, 2019

Women's cricket included in Commonwealth games...

24 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మరోసారి కామన్వెల్త్ క్రీడల్లో లో చోటు దక్కింది. 2022లో జరగబోయే ఈ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను చేర్చేందుకు కామన్వెల్త్ క్రీడా సమాఖ్య అంగీకరించింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ కీడల సందర్భంగా  మహిళా క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. మహిళా క్రికెట్ ప్రపంచవ్యాప్తం కావడంతో పాటు మహిళా సాధికారతకు మంచి అవకాశమంటూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మను సాహ్నే అభిప్రాయపడ్డారు. 

1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. అప్పుడు జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తరువాత నుంచి క్రికెట్‌ను కామన్వెల్త్ క్రీడల్లో చేర్చలేదు. మళ్లీ 24 ఏళ్ల తరువాత మహిళా క్రికెట్‌కు అనుమతి లభించింది. ఆనాటి మ్యాచ్‌ల్లో సచిన్, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లీస్ లాంటి ఆటగాళ్లు పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్‌లో క్రికెట్‌ను కూడా చేర్చాలంటూ సీజీఎఫ్‌ను ఐసీసీ కోరడంతో దానికి ఆమోదముద్ర పడింది. ఎనిమిది జట్లు ఇందులో పాల్గొంటాయి. భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సహా మరికొన్ని దేశాలు పోటీ పడనున్నాయి.