ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరం..! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరం..!

July 21, 2017

అబ్బబ్బ…అమ్మాయిలూ అదుర్స్.. అద్భుతం..అత్యద్భుతం…కేక..కెవ్వు కేక…సూపర్..సెన్సేషన్ ..చెక్ దే ఇండియా..హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. నువ్వు రాక్‌స్టార్‌…వుమెన్స్ టీమిండియా ను పొగడానికి ఈ మాటలు చాలడం లేదు. ఇంకా కొత్త కొత్త పదాలు వెతకాల్సి వస్తుంది. ఎందుకంటే మహిళల వన్డే ప్రపంచ కప్ లో రెండో సెమీస్ ఫైట్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి మిథాలీ సేన ఫైనల్ కు చేరింది. రన్ రాక్ స్టార్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత పదర్శనపై టీమిండియా ప్లేయర్లు, మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ కప్ ని ముద్దాడేందుకు అడుగు దూరం లో వుమెన్స్ టీమిండియా. సూపర్ విక్టరీ సాధించిన మిథాలీ సేనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫైనల్‌ మ్యాచ్‌కి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా.

మహిళల వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్లో మిథాలీ సేన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్‌కి చేరుకుంది. భారత క్రీడాకారిణి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(171 నాటౌట్‌) ఇరగదీసింది. సూపర్ బ్యాటింగ్ తో ఇండియా విక్టరీలో కీ రోల్ పోషించింది.ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బ్యాటింగ్‌ ప్రదర్శన ఔట్‌స్టాండింగ్‌. క్లీన్‌ హిట్టింగ్‌, క్లాస్‌ నాక్‌, పంజాబ్‌ శక్తిని ఫ్రూవ్ చేసింది.

అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్ ను టీమిండియా క్రికెటర్లు , మాజీ లు ఆకాశానికెత్తారు. మిథాలీ సేనతో పాటు హర్మన్‌ప్రీత్‌ను అభినందించారు. క్రికెట్‌ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌లో ఆ దేశ జట్టుతో లార్డ్స్‌ మైదానంలో ఈ ఆదివారం ఢీకొనబోయే భారత జట్టుకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఇన్నింగ్స్‌ అద్భుతం…బౌలర్లు మంచి ప్రదర్శన చేశారని సచిన్ , లక్ష్మణ్ లతో పాటు పలువురు ట్విట్లు చేశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. నువ్వు రాక్‌స్టార్‌. అద్భుత ప్రద్శన చేశావని రవిశాస్త్రి కితాబిచ్చారు.భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు. ఫైనల్‌ చేరుకున్న మీకు గుడ్‌లక్‌ అని టీమిండియా క్రెకెటర్లు కోహ్లీ , కె ఎల్ రాహుల్ , సురేష్ రైనాలు చెప్పారు.