ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. గూగుల్ స్పెషల్ డూడుల్ - Telugu News - Mic tv
mictv telugu

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. గూగుల్ స్పెషల్ డూడుల్

March 8, 2023

Women’s Day: Google Doodle highlights the many ways women support each other

ప్రపంచమంతా నేడు (మార్చి 8) మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ప్రత్యేక దినాల్లో తన డూడుల్‌తో అనేక విషయాలను తెలుపుతున్న ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం.. ఈసారి మహిళలకు మద్దతు ఇచ్చే అనేక మార్గాలను గౌరవిస్తూ మరో క్రియేటివ్ యానిమేషన్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది.

ఈ డూడుల్ లో మహిళలు వారి హక్కుల కోసం పోరాడటం, సైన్స్, వైద్య రంగాల్లో మహిళ పాత్ర, ఓ తల్లిగా ఆమె బాధ్యతలను నిర్వర్తిస్తుండటం డూడుల్ లో చూడవచ్చు. ఈ డూడుల్ థీమ్ లక్ష్యం మహిళలకు మద్దతు ఇవ్వడమని, నా జీవితంలో ఇతర మహిళలు నాకు మద్దతు ఇచ్చిన అన్ని మార్గాలను ప్రతిబింబిస్తూ చాలా సమయం గడిపానని ఈ డూడుల్ ను రూపొందించిన కళాకారిణి అలిస్సా వినాన్స్ అన్నారు.

1977లో ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ఆమోదించిన రోజును గూగుల్ డూడుల్ సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తున్నారు.